Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ACB | ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ దాడులు

ACB | ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ దాడులు

వినాయక్ నగర్, జూన్ 23 : నిజామాబాద్ జిల్లాలో అవినీతి విరోధక శాఖ అధికారుల బృందాల దాడులు కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.

మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వచ్చినట్టు తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం నుండి ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయం నుండి దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం తో పాటు నగరంలోని ప్రగతి నగర్ లో ఈఎస్ నివాసముండే ఆయన ఇంటిపై ఏకధాటిగా దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఈఎస్ కార్యాలయంలోని కొన్ని డాక్యుమెంట్లను ఏసీబీ బృందం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఈఎస్ ఇంట్లో నుంచి పలు రికార్డులతో పాటు ఇతర విలువైన వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఈఎస్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న ఈఎస్ ఇంటిపై సైతం ఏసీబీ అధికారుల బృందం దాడి చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana