Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ACB  Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టోలిచౌక్‌ ఎస్సై

ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టోలిచౌక్‌ ఎస్సై

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ జోన్‌ పరిధి టోలిచౌక్‌ ఎస్సై పాండు నాయక్‌ ( SI Pandu Naik ) లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుడు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులకు ఎస్సైను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని, అదేవిధంగా పాస్‌పోర్టును సీజ్‌ చేయవద్దని ఎస్సై పాండు నాయక్‌ను కోరగా అందుకు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనల మేరకు నగదు అందిస్తుండగా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana