Dailyhunt
అద్దె కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 50 కార్లు స్వాధీనం

అద్దె కార్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 50 కార్లు స్వాధీనం

హైదరాబాద్‌ : కార్లకు అధిక అద్దె చెల్లిస్తామంటూ తీసుకొని యజమానులకు తెలియకుండా విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. తన కారును అద్దెకు తీసుకొని కొందరు అక్రమంగా విక్రయించారని ఓ బాధితుడు జనవరిలో ఆర్సీపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. సోమవారం ఆర్సీపురం పరిధిలో కొందరు అద్దె కార్లను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వ్యవహరించి ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అధిక అద్దె చెల్లిస్తామని నమ్మించి నగరంలోని పలువురు నుంచి వీరు కార్లను తీసుకున్నారు.
ఇలా అద్దెకు తీసుకున్న కార్లను సగం రేట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులపై పలు స్టేషన్ల పరిధిలో ఇదే తరహా కేసులు ఉన్నాయని వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana