Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adivasi March | సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీల మార్చ్‌ను విజయవంతం చేయాలి

Adivasi March | సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీల మార్చ్‌ను విజయవంతం చేయాలి

ఇంద్రవెల్లి : ఆదివాసీ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కేంద్రాల్లో నిర్వహించనున్న ఆదివాసి మార్చ్ ( Adivasi March ) కార్యక్రమాలను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా.అరుణ్ కుమార్ ( Arun Kumar ) పిలుపు నిచ్చారు.

శనివారం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7న ఏటూరు నాగారం, 16వ తేదిన ఉట్నూర్, 21న భద్రాచలం , 28 న మన్ననూరు ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ ల నిర్వహణ చేయనున్నట్లు వెల్లడించారు. 50 ఏళ్లుగా ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకుంటున్న లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించేందుకు ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ ద్వార నే ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాబురావు , జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ , జిల్లా అధ్యక్షులు పెందూరూ దాధిరావ్ , రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగ్ నాథ్, ప్రధాన కార్యదర్శి పురక చిత్రులు , కనక గణేష్, తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు మెస్రం జైరాం, విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు గేడం లాలు ప్రసాద్, తుడుం దెబ్బ మండలం కార్యనిర్వాహణ అధ్యక్షులు కుర్సెంగ రాందాస్, మెస్రం సందీప్, పెందుర్ క్రిష్ణ, పూర్క నగేష్, మెస్రం మోతిరాం, కనక రాందాస్, గేడం నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana