భువనేశ్వర్: ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగే 'అగ్ని-5' బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో బుధవారం విజయవంతంగా పరీక్షించారు.
2012లో తొలిసారిగా పరీక్షించిన అగ్ని-1 క్షిపణి.. 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని-2.. 2,000 కిలోమీటర్లు, అగ్ని-3.. 2,500 కిలోమీటర్లు, అగ్ని-4.. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
