Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరితగతిన లభిస్తాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ హబ్‌ను సబితా ఇంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సంర్భంగా మంత్రి సబిత మట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణ కార్యకలాపాలకు చర్యలు చేపట్టిందని వివరించారు. స్థానికంగా ఉండే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ప్రాంతాల్లోనే ఐటీ ఉద్యోగాలు పొందడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు.

అనంతరం లకారం ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఖమ్మం జిల్లాకు ఐటీ రంగాన్ని తీసుకురావడం పట్ల మంత్రి పువ్వాడకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana