Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాపై పగబట్టిన కరోనా  రక్కసి

అమెరికాపై పగబట్టిన కరోనా రక్కసి

వాషింగ్టన్‌ : కరోనా మహమ్మారి అమెరికాను అతలకుతలం చేస్తుంది. దేశంలో కరోనా విజృంభణ అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో ౩౩ లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులగా రోజుకు 60 వేల కొత్త కేసులు వెల్లడికగా .. నిన్న ఒక్కరోజే 72వేల కేసులు నమోదయ్యయి. గత 24 గంటల్లో 849 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో మొత్తం కొవిద్‌ కేసుల సంఖ్య 32,91,781కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,36,671కి పెరిగింది. కాలిఫోర్నియా. ఫ్లోరిడా, టెక్సాస్‌లో వైరస్‌ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 30 వేలకు పైగా కేసులు వెలుగుచూసాయి. పరిస్థితి ఇలానే వుంటే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే రోజలు మరెంతో దూరంలో లేవని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు 14.60లక్షలకు పైగా ప్రజలు కరోనా నుంచి కోలుకున్నాట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana