- ఒప్పందం చేసుకుంటే దేశ వ్యాప్త ఆందోళన
- ఎస్కేఎం హెచ్చరిక
న్యూఢిల్లీ: అమెరికాతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని కేంద్రానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హెచ్చరించింది.
కేంద్రం సంతకం చేస్తే, ఆ మరునాడే దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఆందోళనకు దిగాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆగస్టు 10న దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చింది.

