Dailyhunt
అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్‌- వీడియో వైరల్

అండర్ వాటర్‌లో మెహరీన్‌కు ప్రపోజ్‌- వీడియో వైరల్

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ మెహరీన్ పిర్జాదా. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అనేక సినిమాలలో నటించిన మెహరీన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ భవ్య బిష్ణోయ్‌తో జైపూర్ లో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ సెర్మనీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఈ కపుల్ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అవి తెగ వైరల్ అయ్యాయి.

మరికొద్ది రోజులలో పెళ్లి చేసుకోనున్నభవ్య, మెహరీన్‌లు ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిఅందిస్తున్నారు. మెహరీన్ రీసెంట్‌గా భవ్య తనకు ఎలా ప్రపోజ్ చేశారో ఓ వీడియో రూపంలో తెలియజేసింది. ఫిబ్రవరిలో ఇద్దరం అండమాన్‌కు వెళ్లాం.

స్కూబా డైవ్ చేస్తున్న సమయంలో భవ్య నాకు రింగ్ తొడిగి పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేశాడు. నీళ్లలో మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం ముచ్చటేసింది. ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. మొదటి తీపి జ్ఞాపకం ఇది అని పేర్కొంది. కాగా, మెహరీన్ నటించిన ఎఫ్ 3 ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana