Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anna Konidala | పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల స్పెషల్ బర్త్‌డే విషెస్.. టచ్ చేశావు అంటున్న ఫ్యాన్స్

Anna Konidala | పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల స్పెషల్ బర్త్‌డే విషెస్.. టచ్ చేశావు అంటున్న ఫ్యాన్స్

Anna Konidala | పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా పవన్‌కు విషెస్ వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన భార్య అన్నా కొణిదెల చేసిన ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నా కొణిదెల తన భర్తతో కలిసి ఉన్న ఓ అందమైన, వ్యక్తిగత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు పవన్‌పై తనకున్న ఆప్యాయతను, ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానం, గౌరవాన్ని ప్రతిబింబించేలా హృదయపూర్వక సందేశాన్ని రాశారు.

అన్నా కొణిదెల తన పోస్టులో.. "ఈ రోజు మీ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతో మంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. మీరు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశారో, ఇతరులకు ఎంతగా ఇచ్చారో చెప్పడానికి ఇదొక అందమైన ప్రతిబింబం. పుట్టినరోజు శుభాకాంక్షలు!" అంటూ భావోద్వేగపూర్వకంగా విషెస్ తెలిపారు.చిన్నదైన ఈ సందేశంలోనే పవన్ కళ్యాణ్‌పై ఉన్న కుటుంబ అనుబంధంతో పాటు.. ఆయన వ్యక్తిత్వం, సేవా భావం, ప్రజల్లో సంపాదించుకున్న గౌరవాన్ని అన్నా కొణిదెల ప్రస్తావించడం విశేషంగా నిలిచింది.

అన్నా కొణిదెల షేర్ చేసిన ఫొటోలో దంపతులు ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా కనిపిస్తున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన రాజకీయ, సినీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే కుటుంబ సభ్యులు పంచుకునే ఇలాంటి వ్యక్తిగత క్షణాల ఫొటోలకు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అందుకే అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ ఫొటో, ఆమె రాసిన బర్త్‌డే నోట్ ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు కూడా కామెంట్ల రూపంలో తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు కేవలం కుటుంబ సభ్యుల నుంచే కాకుండా.. సినిమాలు, రాజకీయాలు, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో ఆయనతో అనుబంధం ఉన్న ఎంతోమంది నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana