Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు కరోనా

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు కరోనా

బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు కరోనా సోకింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు జ్వరం, శ్వాససమస్యలు రావడంతో నగరంలోని బౌరింగ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స నిమిత్తం ఆమెను కొవిడ్‌ ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. శశికళ కొద్ది రోజుల్లో జైలు నుంచి విడుదల కానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana