తాజావార్తలు
అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించాం

- టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనే శివారు ప్రాంతాలు అభివృద్ధి
- పట్టభద్రుల అభ్యర్థి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి
- విద్యావంతులకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ రంజిత్‌రెడ్డి,
- టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
మణికొండ/బండ్లగూడ/మైలార్‌దేవ్‌పల్లి, మార్చి 6 : ప్రజాసంక్షేమంతో పాటు విద్యావంతులకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, విద్యావంతులంతా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సుందర్‌గార్డెన్స్‌లో మున్సిపల్ ప్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ శివారు ప్రాంతాల అభివృద్ధిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఘనత తమ పార్టీదేనన్నారు. సీఎం కేసీఆర్ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని పట్టభద్రులంతా అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఇతర పార్టీలకు ఓటమి భయం పుట్టుకుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ తెలంగాణలో చేసిందేమిలేదన్నారు. రోజు పెట్రోల్ ధరలు పెంచుతూ, ఏరాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ర్టానికి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ తెలంగాణకు బడ్జెట్‌లో మొండి చేయి చూపించిన బీజేపీకి జరగబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.సాయిరెడ్డి, కౌన్సిలర్లు పి.శైలజ, వసంత్ చౌహాన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బి.శ్రీరాములు, మాజీ ఎంపీపీ మల్లేశం, నాయకులు నర్సింహ, లక్ష్మయ్య, ప్రభావతి, కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో..
హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబుబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు టి ప్రేమ్‌గౌడ్ కార్యకర్తలతో కలిసి శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం వాకింగ్ చేసే పట్టభద్రులకు టీఆర్‌పార్టీ బలపరిచిన వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించాలని వారిని కోరారు. కార్యక్రమంలో మల్లేష్ ,రమణగౌడ్ ,నిఖిల్ ,శివ తదితరులు పాల్గొన్నారు.
సురభి వాణిదేవికి మద్దతు తెలపాలి
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని పట్టభద్రులందరూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఓటు వేయాలని ప్రొఫెసర్ కోరని రవీందర్ ప్రచారం నిర్వహించారు. ఆయన రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్‌సిటీలో ఉదయం వాకింగ్ వచ్చిన పట్టభద్రులతో చర్చించి వాణిదేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శర్మ, గౌతమ్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.