Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ క్రీడల్లో ఎంజీయూ విద్యార్థులు రాణించాలి : రిజిస్ట్రార్ అంజిరెడ్డి

అంతర్జాతీయ క్రీడల్లో ఎంజీయూ విద్యార్థులు రాణించాలి : రిజిస్ట్రార్ అంజిరెడ్డి

రామగిరి, ఆగస్టు 29 : చదువుతో పాటు ఎంజీయూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఖ్యాతి చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి అన్నారు.

ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. శ్రమిస్తే సకలం సాద్యంమన్నారు. అయితే శ్రమ ఇష్టంతో జరుగాలన్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుందని, కఠిన శ్రమతో పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని జయించి విజయాలు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులు వర్సిటీలోని క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. నేటి యువతను పట్టిపీడిస్తున్న ఇంటర్నెట్ వ్యాపకానికి క్రీడలే సరైన పరిష్కారమని. ఇవి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

గ్రామీణ పేదరిక నేపథ్యాన్ని ఎదుర్కొంటూ ఒలింపిక్ పతకం సాధించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎంజీయూ విద్యార్థిని నారిమల్ల ప్రవళిక, ఆమె తల్లిని విజయను ఘనంగా సన్మానించారు. అనంతరం క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు, అధ్యాపకులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొ.ఆకుల రవి, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డా.పి.మద్దిలేటి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ డా.లక్షీప్రభ, క్రీడా కోచ్ పరశురామ్, ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొ.డా.వై.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొ.శ్రీలక్ష్మీ, అసిస్టెంట్ ప్రొ.డా.మారం వెంకటరమణరెడ్డి, స్పోర్ట్స్ బోర్డు కార్యాలయ అసిస్టెంట్ ఆర్.హరికిష రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana