Friday, 30 Oct, 2.09 am నమస్తే తెలంగాణ

తాజావార్తలు
అప్పుల్లేని రైతును చూడాలే..

  • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయూత
  • ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
  • అట్టహాసంగా బాదేపల్లి నూతన మార్కెట్‌ కమిటీ ప్రమాణం

జడ్చర్ల టౌన్‌ : వ్యవసాయ రంగానికి చేయూతనిస్తూ అప్పుల్లేని రైతును చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాదేపల్లి మార్కెట్‌ యార్డు ఆవరణలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి వారు హాజరయ్యారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌తోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని అమలు చేశారన్నారు. ప్రతి ఏడాది రూ.14 వేల కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. రా ష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాలు ప్ర శంసిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు మ ద్దతు ధర కల్పించేందుకుగానూ ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాగోగులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చాకే వారికి మంచి రోజులు వ చ్చాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు, నా యకులు, కార్యకర్తలు కలసి మెలసి కుటుంబంగా ఉం టున్నారని తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని వారన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో పదవులు పొందటం అదృష్టంగా భావించాలని వారు సూచించారు. అంతకు ముందు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మయ్య, వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌ మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కమిటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ యా దయ్య, భూత్పూరు ఎంపీపీ శేఖర్‌రెడ్డి, ము న్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజ్‌, మత్స్యకార సం ఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, విం డో చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి నవీన్‌, డైరెక్టర్లు శివదర్శన్‌, అబ్దుల్‌ హబీబ్‌, హీర్యానాయక్‌, అంజమ్మ, శేఖర్‌రె డ్డి, సుభాష్‌, రామకృష్ణారెడ్డి, రేణయ్య, మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పిట్టల మురళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top