Dailyhunt
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్

AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్

ముంబై: ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్‌, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్‌(AR Rahman).. తన భార్య సైరాకు బ్రేకప్ చెప్పేశారు. తమ బంధానికి ముప్పై ఏళ్లు నిండుతుందని ఆశించానని, కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పగిలిన హృదయాలను ఆ దేవుడు కూడా మోయలేడని రెహ్మాన్ తన ఎక్స్ అకౌంట్‌లో అభిప్రాయపడ్డారు. పగిలిన హృదయాలు మళ్లీ అతకవని, అయినా కానీ ఓ అర్ధాన్ని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా బలహీనమైన దశలో తమ బంధం ఉందని, మా ప్రైవసీని గౌరవించిన మిత్రులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రెహ్మాన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

రెహ్మాన్‌, సైరా బ్రేకప్ గురించి లాయర్ సంయుక్త ప్రకటన చేశారు. ఒకర్ని ఒకరు విడిపోవాలన్న నిర్ణయాన్ని ఆ జంట తీసుకున్నట్లు లాయర్ వెల్లడించారు. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ లాయర్ చెప్పారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచేశాయని తెలిపారు. అయితే ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.

రెహ్మాన్‌, సైరాలు 1995లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతిజా, రహీమా, అమీన్‌. తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ అమీన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి మ్యూజిక్ అందించిన రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆ సమయంలో మోజార్ట్ ఆఫ్ మద్రాస్‌గా టైం మ్యాగ్జిన్ ఆయన్ను కీర్తించింది.

1992లో రిలీజైన రోజా మూవీతో రెహ్మాన్ కెరీర్ టర్న్ అయ్యింది. పెద్దల కుదిర్చిన పెళ్లిని ఎలా చేసుకున్నారని 2012లో ఓ జర్నలిస్టు ఆయన్ను ప్రశ్న వేశారు. అయితే దానికి సమాధానం ఇస్తూ.. నిజం చెప్పాలంటే వధువును వెతుక్కునే టైం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. రంగీలా, బాంబే లాంటి చిత్రాలు చేస్తున్న సమయంలో చాలా బిజీగా ఉన్నానని, ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు నా వయసు 29 ఏళ్లు అని, పెళ్లి కూతుర్ని వెతికి పెట్టండి అని తన తల్లికి అప్పుడే చెప్పినట్లు రెహ్మాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నా భార్య చాలా సింపుల్‌గా ఉండాలని భావించానని, తన కెరీర్‌కు ట్రబుల్ రావొద్దని ఆశించానని, దాని వల్ల తన మ్యూజిక్‌పై దృష్టి పెట్టవచ్చు అనుకున్నానన్నాడు. ఓ సూఫీ క్షేత్రం వద్ద సైరా సోదరి తన తల్లికి పరిచయం అయ్యిందని, ఆ తర్వాత సైరాతో బంధం ఏర్పడిందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana