Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ASA | రోహిత్ వేముల చట్టం ఆవశ్యకతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ASA | రోహిత్ వేముల చట్టం ఆవశ్యకతపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ASA | హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలోని దొడ్డి కొమురయ్య సెమినార్ హాల్‌లో ఈ నెల 30 (ఆదివారం) మధ్యాహ్నం రోహిత్ వేముల చట్టం ఆవశ్యకతపై ASA ఆధ్వర్యంలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ASA)కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జీ దండు నవకిరణ్ తెలిపారు.

శనివారం హన్మకొండలో రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

అనంతరం నవకిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, విశ్వ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు. HCUలో జరిగిన తీవ్ర వివక్షత మూలంగానే రోహిత్ వేముల మరణించారని ఆరోపించారు. విద్యాలయాల్లో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలనే డిమాండ్ ASA చేస్తుందన్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.రఘునాథ్, బెంగుళూర్ నేషనల్ లా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. ఆశనాసింగ్ , కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది మృదుల వనంగముడి, ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దొంత ప్రశాంత్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నవకిరణ్ కోరారు. ఈ కార్యక్రమంలో కేయూ విద్యార్థులు సురాశి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Read Also :

సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు

Cortisol Face | ముఖం వాపులకు గురైనట్లుగా కనిపిస్తుందా.. దీన్ని ఏమంటారు, బయట పడాలంటే ఏం చేయాలి..?

Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana