Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. 'ధర్మన్' నా కెరీర్‌లో స్పెషల్ మూవీ: డైరెక్టర్

Ashwath Marimuthu | రజనీకాంత్‌తో సూపర్ కంఫర్ట్.. 'ధర్మన్' నా కెరీర్‌లో స్పెషల్ మూవీ: డైరెక్టర్

Ashwath Marimuthu | కోలీవుడ్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కెరీర్ పరంగా డ్రీమ్ రన్ కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'డ్రాగన్' చిత్రం ఘన విజయం సాధించడంతో దర్శకుడిగా ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ విజయోత్సాహంలోనే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుడితో సినిమా చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ధర్మన్'. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా, రజనీకాంత్‌తో తన అనుబంధంపై అశ్వత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్‌తో పనిచేయడం గురించి మాట్లాడుతూ అశ్వత్ మారిముత్తు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక లెజెండరీ స్టార్‌తో పనిచేసేటప్పుడు దర్శకుడికి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. కానీ రజనీకాంత్‌తో తనకు అలాంటి ఇబ్బంది ఏమాత్రం లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.రజనీకాంత్ సార్‌తో నాకు చాలా మంచి కంఫర్ట్ లెవెల్ ఉంది. ఆయనతో పనిచేయడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. 'ధర్మన్' నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ అంటూ దర్శకుడు పేర్కొన్నారు. 'ధర్మన్' చిత్రంపై అశ్వత్ మారిముత్తు మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కేవలం రజనీకాంత్ అభిమానులను మాత్రమే కాకుండా, నేటి జెన్-జెడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులు, యువత, అన్ని వయసుల వారు కలిసి థియేటర్లలో ఆస్వాదించే పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్ స్టార్ ఇమేజ్‌కు తగ్గ మాస్ అంశాలతో పాటు, నేటి తరం ప్రేక్షకులకు నచ్చే ఆధునిక కథనం, వినోదం కూడా సినిమాలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో 'ధర్మన్' ఏ రేంజ్‌లో ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. 'డ్రాగన్' విజయంతో మంచి ఊపులో ఉన్న అశ్వత్ మారిముత్తుకు ఇప్పుడు 'ధర్మన్' రూపంలో కెరీర్‌లోనే అతిపెద్ద అవకాశం లభించింది. రజనీకాంత్ చిత్రం తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఆయన లైనప్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు STR (శింబు)తో కూడా ఆయన తదుపరి సినిమా చేయనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో భారీ చిత్రం, మరోవైపు శింబుతో క్రేజీ ప్రాజెక్ట్.. ఇలా వరుస అవకాశాలతో అశ్వత్ మారిముత్తు కెరీర్ ప్రస్తుతం నిజంగానే డ్రీమ్ రన్‌లో కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana