హనుమకొండ చౌరస్తా : అండర్-15 ఆసియాకప్ (Asia Cup ) పోటీల్లో ఇండియన్ సాఫ్ట్‌బాల్ ( Softball ) జట్టులో ఆడేందుకు వరంగల్ క్రీడాకారిణి వేల్పుల సాయివర్షిని ( Velpula Sai Varshini ) ఎంపిక అయ్యింది.
చైనాలో అక్టోబర్ 12 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న 5వ అండర్-15 ఉమెన్స్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆమె పాల్గొననుందని హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శ్వేత ( CP Swetha) ను మర్యాదపూర్వకంగా కలవడంతో ఆమె క్రీడాకారిణిని అభినందించారు. సీపీ మాట్లాడుతూ ఇండియన్ టీంకు సాయివర్షిని ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. సాయివర్షినినీ క్రీడాకారిణిగా ఎదిగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ పోలేపాక వినయ్ , సాయివర్షిని తండ్రి అనిల్, అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ ఉన్నారు.

