బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో బీబీ3 (వర్కింగ్ టైటిల్)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. హిట్ కాంబినేషన్ పై తెరపైకి ఎప్పుడు సందడి చేస్తుందా..అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన మరో వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో..భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బాలయ్య చిత్ర నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి బడ్జెట్ ను తగ్గించుకుంటున్నాడట.

