Dailyhunt
Bajaj Pulsar : భారత్‌లో న్యూ బజాజ్ పల్సర్ 250 లాంఛ్‌..ధర ఎంతంటే!

Bajaj Pulsar : భారత్‌లో న్యూ బజాజ్ పల్సర్ 250 లాంఛ్‌..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : దేశీ మార్కెట్‌లో న్యూ బజాజ్ పల్సర్ 250ని బజాజ్ ఆటో ఇండియా లాంఛ్ చేసింది. రూ 1,38,000 (ఎక్స్‌షోరూం, ఇండియా) ప్రారంభ ధరతో ఈ బైక్ భారత్ మార్కెట్‌లో ఎంటర్ కానుంది.

పల్సర్ ఎన్‌250, పల్సర్ ఎఫ్‌250 వేరియంట్స్‌లో న్యూ బజాజ్ పల్సర్ 250 అందుబాటులో ఉంటుంది.

పుణేలోని కంపెనీ ప్లాంట్‌లో న్యూ బజాజ్ పల్సర్ 250ని ఉత్పత్తి చేపడతారు. బీఎస్‌6 ప్రమాణాలతో కూడిన న్యూ బజాజ్ పల్సర్ 250సీసీ టెక్నో గ్రే, రేసింగ్ రెడ్ కలర్స్‌లో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఈ బైక్ కేటీఎం 200 డ్యూక్‌, సుజుకి జిక్సర్ 250, యమహ ఎఫ్‌జడ్‌25లకు దీటైన పోటీ ఇవ్వనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana