Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandla Ganesh | ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై బండ్ల గణేష్ ఫైర్.. అసలు నువ్వెవడివి అంటూ కౌంటర్!

Bandla Ganesh | ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై బండ్ల గణేష్ ఫైర్.. అసలు నువ్వెవడివి అంటూ కౌంటర్!

Bandla Ganesh | సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల తరచు రాజకీయ అంశాలపై స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన అంశాలపై ఆయన తరచూ స్పందిస్తుండటంతో, అభిమానులు మరియు రాజకీయ వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలపై ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “రండి దొర… కానీ పొత్తులతో వస్తున్నారా? లేక ఒంటరిగానే వస్తున్నారా? ముందుగా అది చెప్పండి” అనే తరహాలో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు విమర్శించారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రకాష్ రాజ్ పోస్టుకు బండ్ల గణేష్ ఘాటైన కౌంటర్ ఇస్తూ, ప్రతి రాజకీయ లేదా సామాజిక అంశంలో జోక్యం చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదజాలం, నేరుగా ప్రశ్నించిన తీరు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో.. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ ఫైర్ అయ్యాడు. బండ్ల గణేష్ స్పందన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మరింత వేడెక్కింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్‌కు మద్దతు తెలుపుతుండగా, మరోవైపు ప్రకాష్ రాజ్ అభిమానులు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana