Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ మార్కెట్‌లో పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ లాంఛ్‌!

భారత్ మార్కెట్‌లో పోర్షే టేకాన్ ఎలక్ట్రిక్ లాంఛ్‌!

మెర్సిడెస్ బెంజ్‌, ఆడి తర్వాత పోర్షే భారత్ మార్కెట్‌లో తొలి ఎలక్ట్రిక్ కారు టేకాన్ ఎలక్ట్రిక్‌ను లాంఛ్ చేయనుంది. పోర్షే టేకాన్ నవంబర్ 12న దేశీ మార్కెట్‌లో లాంఛ్ కానుంది.

ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసీ, ఆడి ఈట్రాన్‌, ఆడి ఈట్రాన్ జీటీ, జాగ్వర్ ఐ-పేస్‌ల తర్వాత భారత్‌లో పోర్షే ఇండియా నాలుగవ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పోర్షే 20,000 టేకాన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

మొత్తం పోర్షే అమ్మకాల్లో ఇది 7.4 శాతం కావడం గమనార్హం. మాజీ పోర్షే ఎక్ట్సీరియర్ డిజైనర్ మితిజ బోర్కెట్ పోర్షే టేకాన్‌ను మిషన్ ఈ కాన్సెప్ట్ కారుగా డిజైన్ చేశారు. టేకాన్ 1966ఎంఎం వెడల్పు, 1380ఎంఎం ఎత్తు కలిగి ఉంటుంది. ముందుభాగంలో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్‌, ఫోర్ డోర్ మోడల్‌తో స్పోర్టీ లుక్‌తో టేకాన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana