Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌లో భానుడి భగభగలు.. ప్రపంచంలో టాప్‌-50 వేడి నగరాలు ఇక్కడే

భారత్‌లో భానుడి భగభగలు.. ప్రపంచంలో టాప్‌-50 వేడి నగరాలు ఇక్కడే

  • మధ్య భారత్‌లో వడగాలుల తీవ్రత ఎక్కువ

న్యూఢిల్లీ, మే 22: భారత్‌లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్‌-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్‌లోనే ఉన్నాయి.

ఒడిశాలోని బాలన్‌గిరిలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎయిర్‌క్వాలిటీ అండ్‌ వెదర్‌ ట్రాకర్‌ ఏక్యూల్‌.ఇన్‌ ఈ గణాంకాలను విడుదల చేసింది. శుక్రవారం ఉదయానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్‌, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. సగం ప్రభావిత ప్రాంతాలు ఉత్తరప్రదేశ్‌లోనివే కావటం గమనార్హం. వారణాసి, బాందా, బరేలీ, అయోధ్యలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య, మధ్య భారత్‌లో వడగాలుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana