Dailyhunt
Bhairavam | భైరవం షూటింగ్‌ టైం.. కోనసీమలో అదితీశంకర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌

Bhairavam | భైరవం షూటింగ్‌ టైం.. కోనసీమలో అదితీశంకర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌

Bhairavam | నారా రోహిత్ (Nara Rohith), బెల్లంకొండ శ్రీనివాస్‌, మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో భైరవం (Bhairavam) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను స్టిల్స్ రూపంలో షేర్ చేసుకుంది బెల్లంకొండ టీం.

ప్రస్తుతం భైరవంలో బ్యూటీఫుల్‌ లవ్‌ ట్రాక్‌ను షూట్ చేస్తున్నారు. ఒక పక్క కోనసీమ అందాలు.. ఇంకో పక్క క్యూట్‌ లవ్‌ సాంగ్‌.. భైరవం షూటింగ్‌లో భాగంగా అదితీశంకర్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌పై వచ్చే అందమైన ప్రేమ పాట చిత్రీకరణ జెట్‌ స్పీడ్‌లో కొనసాగుతుందని లొకేషన్ స్టిల్స్ షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

మేకర్స్‌ ఇప్పటికే లాంచ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్‌ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మనోజ్‌ గజపతిగా కనిపించబోతుండగా.. మాస్‌ ఫీస్ట్‌లా మనోజ్‌ పాత్ర ఉండబోతుందని ఫస్ట్‌ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌.

థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో నారా రోహిత్‌ వరద పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

కోనసీమలో…

గజపతిగా మంచు మనోజ్‌..

మంచు మనోజ్‌ ప్రీ లుక్‌..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana