Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bhatti Vikramarka | డబ్బుల్లేవ్‌.. కాస్త ఓపిక పట్టండి.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka | డబ్బుల్లేవ్‌.. కాస్త ఓపిక పట్టండి.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka | హైదరాబాద్‌, జూన్‌ 1(నమస్తే తెలంగాణ) : తెలంగాణను సగర్వంగా నిలబెడుతాం, అద్భుతాలు సృష్టిస్తాం, అంతిమంగా మార్పు తెస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..

ఐదేండ్లలో సగం పాలన కూడా పూర్తికాకముందే రాష్ట్ర ఆర్థిక నిర్వహణను పూర్తిగా చేతులెత్తేసింది. ఖజానా ఖాళీ అయ్యిందని, పరిస్థితి తమ చేయి దాటిపోయిందని స్వయంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమక్షంలోనే ఒప్పుకోవడం రాష్ట్ర ప్రజల్లో ఆందోళన, ఆగ్రహం తెప్పిస్తున్నది. 'ప్రస్తుతానికి డబ్బుల్లేవు.. కాస్త ఓపిక పట్టండి.. సర్దుకుపోండి' అంటూ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పొదుపు పాఠాలు చెప్పడం.. ప్రభుత్వ చేతగానితనం, బాధ్యతారాహిత్యం, వైఫల్యాలకు అద్దం పడుతున్నది.

నెలకు రూ.2,200 కోట్ల లోటు

ఎమ్మెల్యేల అంతర్గత సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అత్యంత నిరాశాజనకమైన అంచనాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదని స్పష్టంచేశారు. 'ఆదాయానికి, వ్యయానికి మధ్య ప్రతినెలా ఏకంగా రూ.2,200 కోట్ల వరకు అంతరం(లోటు) ఏర్పడుతున్నదని చెప్పినట్టు తెలిసింది. నిత్యం రూ.వేల కోట్ల కొత్త అప్పులు తెస్తున్నప్పటికీ, అవి దేనికీ సరిపోవడం లేదని, అప్పుల వల్ల కూడా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని ఆయన చేతులెత్తేసినట్టు సమాచారం.

'రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త పథకాల అమలు సాధ్యం కావడం లేదు.. అలాగని ఉన్న పాత పథకాలను తీసేసే పరిస్థితి కూడా లేదు' అని ఆయన నిస్సహాయత వ్యక్తంచేసినట్టు తెలిసింది. 'రాష్ట్రలో పరిస్థితి ఏరోజుకారోజే అన్నట్టుగా సాగుతున్నది. అదనపు ఆదాయం వచ్చే మార్గాలు ఎకడా కన్పించడం లేదు. కాబట్టి ఎమ్మెల్యేలంతా కాస్త సర్దుకుపోవాలి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా కుదుటపడిన తర్వాతే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల గురించి ఆలోచిద్దాం' అని భట్టి అన్నట్టు తెలిసింది.

చేతగానితనాన్ని ప్రజలపై నెట్టేసే కుట్ర

ఆర్థిక పరిస్థితిని చకదిద్దాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం.. ఇప్పుడు తమ చేతగానితనాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు సిద్ధమైంది. ప్రభుత్వంలో డబ్బులు లేవనే చేదు నిజాన్ని, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఎందుకు జరుగడం లేదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని భట్టి విక్రమార ఎమ్మెల్యేలకు సూచించడం గమనార్హం. అదీగాక ఆదాయం పెరిగేలా ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని స్వయంగా ఆర్థిక మంత్రే ఎమ్మెల్యేలను విజ్ఞప్తి చేయడం చూస్తుంటే.. కాంగ్రెస్‌ సరార్‌ వద్ద ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని, తెలంగాణ భవిష్యత్తును ఈ ప్రభుత్వం పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana