Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో సత్తా చాటాలి

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో సత్తా చాటాలి

  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పాలకుర్తి/రాయపర్తి/కొడకండ్ల, మే 22 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రథమస్థానంలో నిలుపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.

శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్‌ పద్ధతిలో చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana