Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీకి అన్నామలై గుడ్‌ బై!.. త్వరలో ప్రజా ఉద్యమం

బీజేపీకి అన్నామలై గుడ్‌ బై!.. త్వరలో ప్రజా ఉద్యమం

కోయంబత్తూర్‌: అధిష్ఠానంతో విభేదాలున్నాయన్న వార్తల వేళ బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

మంగళవారం ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు నబిన్‌ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు తెలిపారు.

మరోవైపు ఆయన త్వరలో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చవచ్చని సన్నిహితులు తెలిపారు. కోయంబత్తూర్‌లో ఆయన అభిమానులు పెట్టిన పోస్టర్లు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. 'మమ్మల్ని ముం దుండి నడిపించు' అనే నినాదం ఆ పోస్టర్లలో రాసి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana