తాజావార్తలు
బీసీ గురుకుల ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల

హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ 6, 7, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశా రు. ఫలితాలను mjptbcwreis.cgg. gov.in వెబ్‌సెట్‌లో చూసుకోవచ్చని సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 22: ఓయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
24, 25న ఈఎస్‌సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
ఖైరతాబాద్, జనవరి 22: ద ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అనుబంధ కళాశాల ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఎంబీఏ (జనరల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) విభాగంలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులు కలిగిన వారు ఈ కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో నిర్వహిస్తున్నామని, ఇతర వివరాలకు 99490 04788, 89196 51355 నంబర్లతో పాటు www. escihyd.orgలో సంప్రదించాలన్నారు.
ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ)/వరంగల్ చౌరస్తా: ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ- 2020 పరీక్షలో అర్హత సాధించినవారు శనివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. దరఖాస్తులకు ఈ నెల 28 చివరి తేదీ అని, ఇతర వివరాలకు www.knruhs.tela ngana.gov.in, www.knruhs.te langana.gov.in ను సందర్శించాలని సూచించింది.
25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈనెల 25 నుంచి 31 వరకు పీజీ ఈసెట్(పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పీజీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ రమేశ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మాడీ(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.
టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం ప్రధాన కార్యదర్శి, అసోసియేట్ అధ్యక్షుడిని ఎన్నుకున్నది. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌పీఆర్ మల్లేశ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస్ శంకర్‌రావును ఎన్నుకున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు తెలిపారు. సంఘం నూతన డైరీని ఈ నెల 24న ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
18 దేశాల్లో టిటా కమిటీలు
హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) శుక్రవారం 18దేశాల కమిటీలను ప్రకటించింది. అమెరికా- మనోజ్ తాటికొండ, యూకే-విశ్వక్ లక్కిరెడ్డి, కెనడా-రంజిత్ గవ్వల, దుబాయ్-నరేశ్ మందుల, కువైట్- సమీయుద్దీన్, మలేషియా-జయచంద్ర, మెక్సికో-రమేశ్ సిలివేరి, ఉరుగ్వే-సతీశ్, బ్రెజిల్-నిరంజన్ బైరబోయిన, సింగపూర్-సంతోష కళా, దక్షిణాఫ్రికా-కిశోర్ పుల్లూరి, ఫ్రాన్స్- శివానంద కౌండిన్య, ఆస్ట్రేలియా-నరేశ్‌లాలా, నెదర్లాండ్స్-వికాస్ జాగృత్, ఐర్లాండ్-వివేక్ చింతలగట్టు, జర్మనీ-గంగపుత్ర రాజన్, చైనా అండ్ హాంకాంగ్-రవి కలదురు, ఇటలీ- సాయి అఖిల్ ఆదిత్య కాకూరి ఉన్నారు. టిటీ గ్లోబల్ ప్రసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల మాట్లాడుతూ.. కమిటీ ఏర్పా టుకు ఆసక్తి గల వారు bit.ly/tit a_nomination లింక్ ద్వారా నామినేషన్ వేసుకోవచ్చన్నారు.
related stories
-
హోమ్ టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతతో 459 ఉద్యోగాలు
-
ఒడిశా నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ
-
తెలంగాణ తాజావార్తలు గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపిక