Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brown Movie | యాక్షన్ మోడ్‌లో కరిష్మా కపూర్.. ఆసక్తికరంగా 'బ్రౌన్' ట్రైలర్

Brown Movie | యాక్షన్ మోడ్‌లో కరిష్మా కపూర్.. ఆసక్తికరంగా 'బ్రౌన్' ట్రైలర్

Brown Movie | బాలీవుడ్ సీనియర్ నటి కరిష్మా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'బ్రౌన్'. ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. సిరీస్ కోల్‌కతా నేపథ్యంలో సాగే ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఒకప్పుడు నగరంలోనే అత్యుత్తమ పోలీసు అధికారిణిగా పేరు తెచ్చుకుని ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల మానసిక క్షోభను అనుభవిస్తూ, మద్యానికి బానిసైన రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్) అనే ఆఫీసర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె దారుణ హత్యకు గురికావడంతో, ఈ కేసును దర్యాప్తు చేయడానికి రీటా బ్రౌన్ మళ్లీ విధుల్లోకి రావలసి వస్తుంది. ఈ క్రమంలో ఆమె తన జూనియర్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ (సూర్య శర్మ)తో కలిసి విచారణను ప్రారంభిస్తుంది. ఈ కేసును ఛేదించే ప్రక్రియలో వారు తమ వ్యక్తిగత జీవితంలోని బాధలను, గతాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ సిరీస్ కథాంశం.

ఈ సిరీస్ గురించి కరిష్మా కపూర్ మాట్లాడుతూ, “రీటా బ్రౌన్ పాత్ర నేను ఇప్పటివరకు పోషించిన పాత్రల కంటే పూర్తి భిన్నమైనది. ఆమెలో ఎన్నో లోపాలు, బలహీనతలు ఉన్నప్పటికీ, జీవితంలో ముందుకు సాగే పట్టుదల ఉంది. ఈ కథలోని భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి” అని పేర్కొన్నారు. అలాగే నటుడు జిష్షూ సేన్‌గుప్తా మాట్లాడుతూ, ఈ సిరీస్ కేవలం ఒక సాధారణ సస్పెన్స్ థ్రిల్లర్‌లా కాకుండా, ప్రతి పాత్రలోనూ ఎంతో లోతు, భావోద్వేగాలు ఉంటాయని, కోల్‌కతా నగరం ఈ కథలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిందని చెప్పారు. అభినయ్ డియో దర్శకత్వంలో, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ 'బ్రౌన్' వెబ్ సిరీస్ జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ5' లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana