Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BRS | కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన.. బాకీ కార్డుల పంపిణీ

BRS | కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన.. బాకీ కార్డుల పంపిణీ

శేరిలింగంపల్లి, సెప్టెంబర్‌ 2 : కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం నానక్‌రామ్‌గూడలో భారీ ధర్నా నిర్వహించారు.

అనంతరం కాంగ్రెస్‌ హామీల అమలుపై బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేశారు.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనలతో శేరిలింగంపల్లి సీనియర్‌ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు ఉంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.

అనంతరం నానక్‌రామ్‌గూడ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు బాకీ కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, నాయకులు పొట్ట నరేందర్‌యాదవ్‌, మారబోయిన రవియాదవ్‌, వాళ హరీష్‌రావు, సంగా రెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, మహిళా నాయకురాలు మమత, గచ్చిబౌలి డివిజన్‌ నాయకులు రాగ మణిశంకర్‌యాదవ్‌, చెన్నం రాజు, దారుగుపల్లి నరేశ్‌, రాజు ముదిరాజ్‌తోపాటు కార్యకర్తలు, మహిళా, యువ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana