Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Buchi Babu | రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు పెడతారు .. బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్ వైరల్

Buchi Babu | రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు పెడతారు .. బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్ వైరల్

Buchi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతున్న వేళ విజయవాడలో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో కళకళలాడింది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడిన బుచ్చిబాబు తన కెరీర్‌లో 'పెద్ది' ఎంత ప్రత్యేకమైన చిత్రమో వివరించారు. 'ఉప్పెన' సినిమా తర్వాత ఐదేళ్ల పాటు మరో సినిమా చేయకుండా గడిపిన సమయం మొత్తం 'పెద్ది' కోసమేనని ఆయన వెల్లడించారు. 'ఉప్పెన' కథను విజయవాడలోనే రాసుకున్నానని, తాను తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా ఇక్కడే తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. అందుకే విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు తనపై ఎప్పుడూ ఉంటాయని భావోద్వేగంగా చెప్పారు.

'పెద్ది' కథ సిద్ధమైన తర్వాత దాన్ని ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు సుకుమార్ తనను రామ్ చరణ్‌తో కలిపారని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా చరణ్ చేయాలని కోరుకుంటూ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించానని, కథ విన్న రామ్ చరణ్ ఒక్క మార్పు కూడా చెప్పకుండా వెంటనే అంగీకరించారని వెల్లడించారు. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, ఇది ఒక ఆటగాడి జీవిత ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన భావోద్వేగ కథ అని బుచ్చిబాబు చెప్పారు. "ఆట అంటే కేవలం వినోదం కాదు.. గౌరవం, గుర్తింపు, జీవితాలను మార్చే శక్తి. అదే 'పెద్ది' కథలోని ప్రధాన అంశం" అని వివరించారు. పడిపోయినా మళ్లీ లేచి నిలబడే యువకుడి పోరాట గాథగా ఈ చిత్రం నిలుస్తుందని అన్నారు.

సినిమాను తాను ఇప్పటికే 50 సార్లకు పైగా చూశానని, ప్రతి సారి కూడా చివరి 40 నిమిషాల సన్నివేశాలు తనను కదిలించాయని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ, "సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు తప్పకుండా భావోద్వేగానికి లోనవుతారు" అన్నారు. జాన్వీ కపూర్ నటనను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన బుచ్చిబాబు, క్లైమాక్స్‌లో ఆమె ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. అలాగే సినిమాలో కీలక పాత్ర పోషించిన అప్పలసూరి పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్రకు ప్రేక్షకుల కళ్లలో నీళ్లు రాకపోతే తన పేరు మార్చుకుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక చరణ్ సర్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈరోజు బుచ్చిబాబు అనే దర్శకుడు ఉండేవాడు కాదు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను" అని భావోద్వేగంగా అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana