Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుమ్రా వచ్చాడు.. కానీ!

బుమ్రా వచ్చాడు.. కానీ!

  • శాంసన్‌, నితీశ్‌ రీఎంట్రీ
  • అఫ్గాన్‌తో సిరీస్‌ భారత జట్టు ప్రకటన

ఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడి శ్రీలంకతో టెస్టు సిరీస్‌కూ దూరమైన స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.

ఈనెల 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ కోసం మంగళవారం జట్టును ప్రకటించిన సెలక్షన్‌ కమిటీ.. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని 15 మంది సభ్యుల్లో బుమ్రా పేరునూ చేర్చింది. అయితే సిరీస్‌లో అతడు బరిలోకి దిగేదీ లేనది మాత్రం ఫిట్‌నెస్‌ పరీక్షలు పాస్‌ అయితేనే!. బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ హర్షిత్‌ రాణా అఫ్గాన్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఈ నలుగురూ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే జట్టులో ఉంటారు.

మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ సిరీస్‌కూ దూరమయ్యాడు. జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన సంజూ శాంసన్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 13, 15, 17తేదీల్లో అఫ్గాన్‌తో ఢిల్లీ వేదికగా టీమిండియా మూడు టీ20లు ఆడుతుంది.

భారత జట్టు: శ్రేయస్‌ (కెప్టెన్‌), అభిషేక్‌, వైభవ్‌, శాంసన్‌, ఇషాన్‌, తిలక్‌, దూబే, నితీశ్‌ రెడ్డి, అక్షర్‌, సుందర్‌, చక్రవర్తి, బిష్ణోయ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, హర్షిత్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana