Thursday, 22 Apr, 9.10 pm నమస్తే తెలంగాణ

తాజావార్తలు
చైనా సైకిళ్ల షేర్డ్ స్కీం ఫెయిల్‌.. గ్రేవ్‌యార్డ్‌ను తలపిస్తున్న బైక్స్‌

బీజింగ్‌: చైనాలో షేర్ సైకిల్-సిస్టమ్ ఆచరణలో తీవ్రంగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనాలోని లియాంగింగ్ ప్రావిన్స్‌లోని షెన్‌యాంగ్ నగర శివారులోని ఓపెన్ ప్లేస్‌లో బారులు తీరిన బైక్‌ల సమూహమే దీనికి నిదర్శనం. హెల్లో బైక్‌, దీదీ, మితువాన్ అనే బైక్ షేరింగ్ సంస్థలకు చెందిన టార్టాయిస్‌, బ్లూ, ఎల్లో బైస్కిళ్లు, బైక్‌లు బారులు తీరి ఉన్నాయి.

చౌక ధరకు లభించే బైక్‌లను యూజర్లు యాప్‌లను ఉపయోగించి ఎక్కడైనా పార్క్ చేయొచ్చు. ఈ రంగంలో లాభాలు ఆశించి ఒఫో, మోబైక్ వంటి స్టార్టప్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. యూజర్లు తాము తీసుకున్న రుణాలు చెల్లించక, రెంటల్ డిపాజిట్లు ఖర్చయి పోయాయి. ఈ నేపథ్యంలో బైక్స్ అన్నీ ఆయా సంస్థల పార్కింగ్ స్థలాల్లో భారీగా కొలువు దీరాయి.

టూ వీలర్స్ పేవ్‌మెంట్లపైన, వీధుల్లో పార్క్ చేయడంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. కొన్ని బైక్‌లను కొందరు వ్యక్తులు పొదల్లోకి విసిరేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పట్టణాలు, నగరాల అధికారులకు, పాదచారులకు ఈ వాహనాల పార్కింగ్ సమస్యగా పరిణమిస్తున్నది.

గతేడాది కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత కొందరు సొంతంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లలో వీటిని నిలిపితే, మరికొన్ని బైక్స్ దెబ్బ తిన్నాయి. ఇంకొన్ని బైక్స్‌ను దొంగలెత్తుకున్నారు. ఈ సమస్య చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మొదలు మెల్‌బోర్న్ నదీ పరివాహాక ప్రాంతం వరకు విస్తరించింది.

షెన్‌యాంగ్‌లో సబర్బన్ ప్రాంతాల్లో నిలిపిన బైక్స్‌పై ఎరియల్‌గా చిత్రీకరించిన ఫొటోలు సైకిళ్ల శ్మశాన వాటికను తలపిస్తున్నాయి. 2018లో టెక్ స్టార్టప్ సంస్థ ఒఫో పెట్టుబడులు పెట్టింది. దీనికోసం యూజర్లు తాము తీసుకున్న రుణాలు చెల్లించలేదు. రెంటల్ డిపాజిట్లు చెల్లించాలని యూజర్లను కోరుతున్నది.

ఒఫో మాదిరే ఇతర సంస్థల ఆధ్వర్యంలో పార్క్ చేయబడ్డ బైక్స్‌లో చాలా వరకు దెబ్బతిన్నాయి. వాటిని రిపేర్ చేయడానికంటే తొలగించడమే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. తాజాగా చైనా మార్కెట్‌లోకి దూసుకొచ్చిన ఎలక్ట్రానిక్ షేర్డ్ స్కూటర్లు.. బైక్స్ మార్కెట్‌ను దెబ్బ తీశాయి.

వివిధ చైనా నగరాలు, పట్టణాలు పేరుకుపోయిన బైక్స్ ఎనిమిది లక్షల వరకు ఉంటాయని అంచనా. వాటిలో 44 వేల బైక్స్‌ను ఈ ఏడాది తొలగిస్తామని బీజింగ్ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

కరోనా కేసుల్లో వరల్డ్ రికార్డు..

18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌

డోంట్‌ వర్రీ..ఆన్‌ లైన్లో ఆక్సిజన్‌ మిషన్లు

అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్ల సీజ్

రష్యా తురుపుముక్క లెనిన్‌.. చరిత్రలో ఈరోజు

ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?

హాస్పిటల్‌ నుంచి 1,710 కొవిడ్‌ వ్యాక్సిన్లు మాయం

వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్‌.. ఎందుకంత డేంజర్‌? ఏం చేయాలి?

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..

నెగెటివ్‌ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్‌కే

'ప్రాణ'గండం!! .. ఊపిరాడని ఉత్తరాది

దేశంలో ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌


కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!

అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

వ్యాక్సిన్ విధానాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

తులం బంగారం 4 నెలల్లో రూ.50వేలకు.. పరిస్థితి విషమిస్తే.. మరింత పైపైకి!

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana
Top