Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నై లవ్‌స్టోరీ@50 కోట్లు

చెన్నై లవ్‌స్టోరీ@50 కోట్లు

"చెన్నై లవ్‌స్టోరీ' చిత్రాన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా బాగా ఆదరిస్తున్నారు. వీక్‌డేస్‌లో కూడా మంచి వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది.

ఈ సినిమాకు ప్రేక్షకులు లాంగ్న్‌ ఇవ్వబోతున్నారు' అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్‌, సాయిరాజేష్‌ నిర్మించిన 'చెన్నై లవ్‌స్టోరీ' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం యాభైకోట్ల వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించిందని, కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్‌హిట్‌గా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్‌ ధీరజ్‌ మొగిలినేని, చిత్ర కథానాయిక శ్రీగౌరిప్రియ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana