Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Child Marriage | మూడేండ్ల బాలికకు 60 ఏండ్ల వృద్ధునితో పెండ్లి

Child Marriage | మూడేండ్ల బాలికకు 60 ఏండ్ల వృద్ధునితో పెండ్లి

Child Marriage | ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మూడేండ్ల బాలికను 60 ఏండ్ల వృద్ధునికి ఇచ్చి పెండ్లి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

బాలిక తండ్రి అబ్దుల్‌ బాకీ.. రూ. 25 లక్షల పాకిస్థానీ కరెన్సీ కోసం ఈ వివాహం కుదిర్చినట్లు ఆరోపణలున్నాయి.

బాలిక తండ్రిని అరెస్ట్‌ చేయగా, 60 ఏండ్ల సలాహుద్దీన్‌ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వధువు ధర(వాల్వర్‌) చెల్లించకపోవడంతో ఈ వివాహం ప్రస్తుతం కాగితాలకే పరిమితమైనట్లు సమాచారం. వష్తన్‌ సమాజంలో 'వాల్వర్‌’ అనే సంప్రదాయం ఉంది. ఇందులో వరుడు లేదా అతని కుటుంబం వధువు కుటుంబానికి డబ్బు చెల్లిస్తుంది. అయితే బాలికకు సంబంధించిన ఈ ఘటనతో ఈ సంప్రదాయం దుర్వినియోగంపై చర్చ మొదలైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana