Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చీరా చొక్కా చిక్కడిపోవాలో..

చీరా చొక్కా చిక్కడిపోవాలో..

గ్ర హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా 'పెద్ది' జూన్‌ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా హ్యూజ్‌ బజ్‌ని క్రియేట్‌ చేస్తున్నది.

ముఖ్యంగా చికిరీ చికిరీ, రైరైరారా సాంగ్స్‌ సోషల్‌ మీడియాలో సంచలనాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్‌ నేడు(శనివారం) విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ పాట ప్రోమోను శుక్రవారం విడుదల చేశారు. 'హెల్లో హెల్లో హెల్లో హెల్లెల్లో.. బావా.. చీరా చొక్కా చిక్కడిపోవాలో..' అంటూ సాగే ఈ పాటను దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ఎనర్జిటిక్‌గా, కలర్‌ఫుల్‌గా చిత్రీకరించినట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తున్నది.

పవర్‌ఫుల్‌ డ్రమ్‌ బీట్స్‌, క్యాచీ రిథమ్‌తో జాతర వాతావరణాన్ని తలపించేలా ఈ ప్రోమో సాగింది. రామ్‌చరణ్‌, శ్రుతిహాసన్‌, జాన్వీ కపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. ైస్టెలిష్‌ స్టెప్పులతో, అద్భుతమైన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ముగ్గురూ ఆకట్టుకున్నారు. శనివారం భోపాల్‌లో జరిగే భారీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో పూర్తి పాటను విడుదల చేస్తారు. శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతిబాబు, దివేందుశర్మ, బోమన్‌ ఇరానీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేల్‌, సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాత: వెంకటసతీశ్‌ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana