Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చివరి నిమిషాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్‌ 539, 117 పాయింట్ల పతనం

చివరి నిమిషాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్‌ 539, 117 పాయింట్ల పతనం

ముంబై, ఆగస్టు 27: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి పదిహేను నిమిషాల్లో అమ్మకాలు పోటెత్తడంతో వరుసగా రెండోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి.

ప్రధానంగా బ్లూచిప్‌ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు రెండు శాతం వరకు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోసింది. వీటికి తోడు అంతర్జాతీయంగా నిరంతర భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం కూడా మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 539.35 పాయింట్లు నష్టపోయి 76,933.59 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 116.90 పాయింట్లు కోల్పోయి 24,090.85 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు మళ్లీ పుంజుకోవడం, నెలవారీ డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ గడువు ముగియడం కూడా మదుపర్లను అమ్మకాల వైపు నడిపించాయని జియోజిట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ రీసర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్ల పతనాన్ని శాసించాయన్నారు.

పడేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

మధ్యాహ్నం 3 గంటల వరకు యథాతథంగా నడుస్తున్న సూచీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పిడుగుపడ్డట్టు అయింది. అమెరికాలో క్లాస్‌-యాక్షన్‌ దావా వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కీలక ప్రతికూల అంశాల్లో ఒకటిగా మారనున్నదని ఫెడరల్‌ చైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ వ్యాఖ్యలు మదుపర్లు ఒక్కసారిగా అప్రమత్తతకు మొగ్గుచూపారు. ఫలితంగా చివరి పావుగంటలో సూచీలు భారీగా నష్టపోయాయి. సూచీల్లో మెజారిటీ వాటా కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు రెండు శాతానికి పైగా పతనం చెందడం ప్రధాన కారణమని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయి టాప్‌ లూజర్‌గా నిలిచాయి.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఇండిగో, ట్రెంట్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి.
  • వీటితోపాటు బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌, ఎస్బీఐ, టీసీఎస్‌, మారుతి, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, టైటాన్‌ షేర్లు పతనం చెందాయి.
  • కానీ, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, బీఈఎల్‌, అదానీపోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana