Congress Vs Janasena | హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో జనసేన కార్యకర్తలు గన్ పార్క్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.
జనసేన కార్యకర్తల మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారని తెలిసిందే. అయితే జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

