Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Danam Nagender | దానం నాగేందర్‌కు మొండిచెయ్యే!.. ఖైరతాబాద్‌పై రేవంత్‌ మార్క్ రాజకీయం

Danam Nagender | దానం నాగేందర్‌కు మొండిచెయ్యే!.. ఖైరతాబాద్‌పై రేవంత్‌ మార్క్ రాజకీయం

Danam Nagender | హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మరో షాక్‌ తగిలినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

పార్టీ ఫిరాయించి అనర్హత వేటుతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయనకు కాంగ్రెస్‌ మరోసారి టికెట్‌ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిని తెరమీదికి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఖైరతాబాద్‌లో తాజా రాజకీయ సమీకరణాలు, పార్టీ అంతర్గత బలాబలాలు, భవిష్యత్తు ప్రయోజనాలను వివరించిన సీఎం, రోహిన్‌రెడ్డి అభ్యర్థిత్వమే పార్టీకి శ్రేయసరమని చెప్పినట్టు ఏఐసీసీ పెద్దల ద్వారా తెలిసింది. సీఎం స్థాయిలోనే ఈ ప్రతిపాదన వెళ్లడంతో అధిష్ఠానం కూడా దాదాపుగా సుముఖత వ్యక్తం చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దానంలో ఆందోళన

పార్టీ హైకమాండ్‌ తీరు, టికెట్‌ కేటాయింపులో జరుగుతున్న అంతర్గత పరిణామాలను పసిగట్టిన దానం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎం నివాసానికి వెళ్లి రెండుసార్లు నేరుగా చర్చించినట్టు తెలిసింది. ఎలాగైనా ఖైరతాబాద్‌ ఉపఎన్నిక టికెట్‌ తనకే దకేలా చూడాలని, ఇప్పటికే తాను ఎమ్మెల్యే పదవి కోల్పోయి రాజకీయంగా సంక్షోభంలో ఉన్నానని సీఎం వద్ద మొరపెట్టుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ రెండు భేటీల్లోనూ రేవంత్‌రెడ్డి నుంచి దానంకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తున్నది. పార్టీ సమీకరణాలు, అధిష్ఠానం నిర్ణయాల మేరకే అన్నీ ఉంటాయంటూ దాటవేత ధోరణి ప్రదర్శించడంతో దానం తీవ్ర నిరాశకు లోనవుతున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

కాంగ్రెస్‌ వైఖరిపై అసహనం

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తన ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో కాంగ్రెస్‌ వైఖరిపై దానం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి తనకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని వాపోయినట్టు తెలిసింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరూ పోటీకి ముందుకు రాని క్లిష్ట సమయంలో పార్టీ పరువు కాపాడేందుకు తాను ధైర్యంగా బరిలోకి దిగానని, గెలిస్తే కేంద్రంలో, ఓడిపోతే రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు స్వయంగా ఇచ్చిన మాటను పూర్తిగా తుంగలో తొకారని దానం మండిపడినట్టు ప్రచారం జరుగుతున్నది.

లోక్‌సభ ఎన్నికలు ముగిసి ఇన్నేండ్లవుతున్నా తనకిచ్చిన హామీ ఊసే ఎత్తకపోవడం నమ్మకద్రోహమేనని బాధపడుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని, సీనియర్‌ అయిన తనను విస్మరించారని దానం ఆవేదన వ్యక్తంచేసినట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు వంటి కీలక వ్యవహారాల్లో కూడా స్థానిక నేతగా ఉన్న తనను పరిగణనలోకి తీసుకోకుండా పకన పెట్టారని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 30 ఏండ్ల రాజకీయ జీవితాన్ని, ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్‌ మాటలు నమ్మి పణంగా పెడితే, చివరికి కనీసం ఉపఎన్నిక టికెట్‌ కూడా ఇవ్వకుండా బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని దానం వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మంత్రి పదవి ఇస్తేనే ఉపఎన్నిక బరిలో దిగుతానని, లేదంటే కాంగ్రెస్‌లో కొనసాగే ప్రసక్తే లేదని తన అనుచరులతో దానం వ్యాఖ్యానించినా.. అసలు పార్టీ నుంచి టికెట్టే దకే పరిస్థితి లేకపోవడంతో దానం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి భరోసా కొరవడటంతో దానం నాగేందర్‌ ప్రత్యామ్నాయ దారులపై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఎర్రతివాచీతో స్వాగతం పలుకుతున్నదని ఆయన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.

గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా, కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేస్తానని ఆయన చెప్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఖైరతాబాద్‌ ఉపఎన్నిక అభ్యర్థిత్వం విషయంలో రోహిన్‌రెడ్డి వైపే రేవంత్‌రెడ్డి మొగ్గు చూపడంతో రాజకీయంగా తన పట్టును నిరూపించుకోవాల్సిన దానం నాగేందర్‌ ఏ మలుపు తిరుగుతారో? ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర చర్చగా మారిందని కాంగ్రెస్‌ శ్రేణులు, రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana