దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఒక మావోయిస్టు హతమయ్యాడు. చిక్‌పాల్, మర్జూమ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారని, ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడని వెల్లడించారు. అతనిపై రూ.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు. ఘటనా స్థలంలో 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

