న్యూఢిల్లీ: విపక్ష నేత రాహుల్ గాంధీకి పలు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోవడంతో దీపావళి ప్రధాన షాపింగ్ సీజన్‌ను కాపాడటానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ వ్యాపారులు శనివారం ఇండియా కూటమిలోని ఇతర నాయకులైన అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ థాక్రే తదితరులను ఆశ్రయించారు.
ప్రతిపక్ష నాయకులకు చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఒక లేఖ రాస్తూ రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం జరగనున్న కాంగ్రెస్ ర్యాలీని నవంబర్ 10-11 తర్వాత మరో తేదీకి మార్చేలా కాంగ్రెస్‌ను ఒప్పించాలని కోరింది. ఈ ర్యాలీ వల్ల ప్రధాన మార్కెట్లలో రోజుకు రూ.10,000-12,000 కోట్ల విలువైన వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సీటీఐ పేర్కొంది.

