మద్దూరు (ధూళిమిట్ట): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ( Teaching profession ) ఎంతో పవిత్రమైనదని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ ( DEO Ramesh) అన్నారు.
ధూళిమిట్ట హైస్కూల్లో గెజిటెడ్ హెచ్ఎం, ఎంఈవో అనుముల కరుణాకర్ రెడ్డి ( Karunakar reddy ) ఉద్యోగ విరమణకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి అవసరమైన మానవ వనరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గెజిటెడ్ హెచ్ఎంగా, ఎంఈవో కరుణాకర్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రధానంగా ధూళిమిట్ట హైస్కూల్ అభివృద్ధి కోసం చూపిన చొరవ అభినందనీయమన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్ఎం చిలుక వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభలో రిటైర్డు డీఈవో శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ గునుకుల లీలాజగన్మోహన్ రెడ్డి , మద్దూరు ఎంఈవో వరదరాజు, విశ్రాంత ఉపాధ్యాయులు తిగుళ్ళ సుధాకరశర్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

