Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dharmasthala Niyojakavargam | రాజకీయాల తెరవెనుక అసలు నిజాలు.. ఆసక్తికరంగా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్!

Dharmasthala Niyojakavargam | రాజకీయాల తెరవెనుక అసలు నిజాలు.. ఆసక్తికరంగా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్!

Dharmasthala Niyojakavargam Trailer | డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో, సుమన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న తాజా పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'.

జై జ్ఞాన ప్రభా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఇది కేవలం సాధారణ రాజకీయ సినిమా మాత్రమే కాకుండా, నేటి సమాజంలోని వ్యవస్థలను ప్రశ్నించేలా బలమైన సామాజిక సందేశంతో, ముఖ్యంగా డ్రగ్స్ వంటి దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే కథాంశంతో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెరపై సాయికుమార్ తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ, రాజకీయ నాయకుడిగా కనిపించి మరోసారి అంచనాలను తారాస్థాయికి చేర్చారు. ఆయనతో పాటు సీనియర్ నటుడు సుమన్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర తదితరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన నటుల అభినయం, ఆకట్టుకునే మాటలు, థ్రిల్ చేసే యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ చిత్రం, సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు ముస్తాబవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana