Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Donalad Trump | ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన డొనాల్డ్‌ ట్రంప్‌

Donalad Trump | ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన డొనాల్డ్‌ ట్రంప్‌

Donalad Trump : ఫ్రాన్స్‌ (France) లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు (G-7 Summit) లో భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రపంచ దేశాల నేతలు పాల్గొన్న ‘వర్కింగ్ లంచ్’ సందర్భంగా మోదీ వ్యక్తిత్వాన్ని, పనితీరును కొనియాడుతూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎంతో ప్రశాంతంగా ఉంటారని, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనొక ‘టోటల్ కిల్లర్’ అని అన్నారు. ‘కానీ నేను ఆయనలా కాదు. ఒకసారి ఆయన్ని చూడండి’ అంటూ చమత్కరించారు.

తన దూకుడు స్వభావానికి, మోదీ నిశ్చల వైఖరికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ట్రంప్ ఈ మాటలతో పోల్చి చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరగనున్న భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెరికా ప్రతినిధి సెర్గియో గోర్ తెలిపారు. ప్రధాని మోదీని కలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందని, వారిద్దరి సమావేశం కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జీ-7 సదస్సు వేదికగా ఇరు దేశాధినేతల మధ్య నెలకొన్న సానుకూల వాతావరణానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana