Dailyhunt
Donald Trump | హార్ముజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్

Donald Trump | హార్ముజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై బూతులతో రెచ్చిపోయారు. తాను ఎంతగా హెచ్చరించినా హార్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో ట్రంప్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్‌ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌పై భీకర దాడులు తప్పవని హెచ్చరించారు.

''మంగళవారం పవర్ ప్లాంట్ డే. బ్రిడ్జి డే. అన్నీ కలిపి ఇరాన్‌లోనే జరుగుతాయి. దీనికేదీ సాటిరాదు. హార్ముజ్ జలసంధిని తెరవండి. లేకుంటే ఇరాన్‌లో కాదు. నరకంలో ఉన్నట్లే. చూస్తూ ఉండండి. అల్లాను ప్రార్థించండి'' అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. అంతేకాదు.. వర్ణించలేని బూతు పదాల్ని వాడాడు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందే అని ఇరాన్‌కు ఇప్పటికే ట్రంప్ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పినట్లు చేయకపోతే ఇరాన్‌లోని బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికను ఇరాన్ తేలికగా తీసుకుంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లోని చమురు కేంద్రాలపై దాడులు చేస్తోంది.

అలాగే, తమ దేశంలోని పౌర కేంద్రాలపై దాడులు చేస్తే తాము కూడా మరింత బలంగా దాడి చేస్తామని హెచ్చరించింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌పై దాడులు చేస్తున్నాయి. అలాగే, ఆదివారం అమెరికాకు చెందిన యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. సీ-130 అనే రెండు రవాణా విమానాల్ని, రెండు బ్లాక్ హ్యాక్ అనే హెలికాప్టర్లను కూల్చినట్లు తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana