Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Donald Trump | హర్మూజ్‌ను తెరిచే ఉంచుతాం.. అవసరమైతే నిర్బంధానికి సిద్ధమే..!

Donald Trump | హర్మూజ్‌ను తెరిచే ఉంచుతాం.. అవసరమైతే నిర్బంధానికి సిద్ధమే..!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి హర్మూజ్ జలసంధి (Hormuz Strait) విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని పేర్కొన్న ట్రంప్..

అవసరమైతే తమ నౌకా దళాలను మోహరించి.. దిగ్భంధిస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతానికి హర్మూజ్‌ బ్లాకేడ్‌పై తొందరపడడం లేదని, ఇరాన్ దారికి రాకుంటే నిర్బంధం తప్పదని ట్రంప్ తేల్చి చెప్పారు.

హర్మూజ్ జలసంధి మూసివేతపై సోషల్ మీడియా ట్రుత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో చర్చలు ఫలవంతమయ్యేలా కనిపిస్తున్నందున తాను హర్మూజ్‌ను తెరిచి ఉంచేందుకు అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.

‘హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు నేను అంగీకరించాను. ఇకపై నౌకలతో హర్మూజ్‌ను దిగ్భందించం. అదే సమయంలో మా నౌకలన్నీ బ్లాకేడ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దిగ్భంధనం వద్దనిపిస్తోంది అని ట్రుత్ పోస్ట్‌లో పేర్కొన్న ట్రంప్.. అణ్వాయుధాల పరిశీలనకు ఇరాన్‌ పూర్తిగా అంగీకరించిందని వెల్లడించారు. ఒకవేళ టెహ్రాన్ తమ అణ్వాయుధాల పరిశీలనకు అనుమతించకుంటే చర్చలను నిలిపివేస్తామ’ని ట్రంప్ హెచ్చరించారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. లెబనాన్‌పై ఇజ్రయేల్ దాడులకు ప్రతిచర్యగా హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana