Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పిస్తాం

డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కల్పిస్తాం

  • డీజీపీతో యూత్‌ ఫర్‌ యాంటీ కరెప్షన్‌ ప్రతినిధులు

హైదరాబాద్‌, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సభ్యులు డీజీపీ ఆనంద్‌కు తెలిపారు.

శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. యూత్‌ ఫర్‌ యాంటీ కరెప్షన్‌ ద్వారా 15 ఏండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

డ్రగ్స్‌ నిర్మూలనకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తామని, పోలీస్‌శాఖ సహకరించాలని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ ఫౌండర్‌ రాజేంద్ర ప ల్నాటి డీజీపీని కోరారు. స్పందించిన డీజీపీ ఇలాంటి కార్యక్రమాలకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, తప్పకుండా సహకరిస్తామని స్పష్టం చేశారు. వైఏసీ గ్రేటర్‌ అధ్యక్షుడు కొన్నె దేవేందర్‌, శ్రీధర్‌ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana