రాష్ట్రానికి అభినందనలు తెలిపిన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు. ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌దే. 25 ఏండ్ల క్రితం సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ప్రారంభించిన మంచినీటి పథకమే మిషన్ భగీరథ. కేంద్రం ప్రారంభించిన హర్‌ఘర్ జల్ పథకానికి మిషన్ భగీరథే ఆదర్శం. మారుమూల ప్రాంతా ల గ్రామాలకు, అతి తక్కువ జనభా ఉన్న ఆవాసాలకు సైతం మంచినీటి అందిస్తున్నాం. ఈ శాఖను నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉన్నది.
- ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

