Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈనెల 16న విడుదలకానున్న వివో ఎక్స్‌ 50 సిరీస్‌

ఈనెల 16న విడుదలకానున్న వివో ఎక్స్‌ 50 సిరీస్‌

ఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ వివో త్వరలో సరికొత్త మోడళ్లను భారత్‌లో లాంచ్ చేయనుంది. వివో ఎక్స్50 సిరీస్‌లో వివో X50, X50 ప్రొ, X50 ప్రొ+ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లు ఉండగా కేవలం రెండింటిని మాత్రమే జూలై 16న ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది. ఎక్స్‌50 సిరీస్‌ ఫోన్లను వివో ఇప్పటికే చైనాలో విడుదల చేసింది. వివో ఎక్స్‌50, ఎక్స్‌ 50 ప్రొలలో 6.56 అంగుళాల అమోఎల్‌ఈడీ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, స్నాప్‌డ్రాగన్‌ 765జీ చిప్‌సెట్‌తో డిజైన్‌ చేశారు.

వివో ఎక్స్‌ 50 బ్యాటరీ కెపాసిటీ 4,200 mAh కాగా, వివో ఎక్స్‌ 50 ప్రొలో బ్యాటరీ కెపాసిటీ 4,315 mAhగా ఉంది.

48+13+ 8+5 మెగా పిక్సల్‌ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఉన్నది. వివో ఎక్స్‌50 ప్రొలో 48+8+ 13+8 మెగా పిక్సల్‌తో పాటు గింబల్‌ కెమెరాతో డిజైన్‌ చేయడం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana