Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏకీకృత కార్యాచరణతోనే జలభద్రత : ఉత్తమ్‌

ఏకీకృత కార్యాచరణతోనే జలభద్రత : ఉత్తమ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌2 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జలసంరక్షణ పనినీ ఒకే జలభద్రతా ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రతి జలసంరక్షణ నిర్మాణానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలని, నిర్వహణ బాధ్యత సంస్థను స్పష్టంగా నిర్దేశించాలని, తద్వారా కొలువగలిగే ఫలితం సాధించాలని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ సుష్మా స్వరాజ్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారీ సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. జలభద్రతను కేవలం ఇంజినీర్లు, ప్రభుత్వ శాఖల కార్యక్రమంగానో చూడకూడదని, తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాధులు, పట్టణాల భద్రత, పర్యావరణ పరిరక్షణకు జలభద్రత అత్యంత కీలకమైన ప్రజా ఉద్యమంగా మారాలని పేరొన్నారు. జల సంరక్షణలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.

కుట్టు మిషన్లకు 1.80లక్షల దరఖాస్తులు

  • 15 వరకు గడువు : పొన్నం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌2 (నమస్తే తెలంగాణ): బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కోసం దరఖాస్తులను ఆహ్వానించగా ఇప్పటివరకు 1,80, 170 అప్లికేషన్లు వచ్చాయని, 15వ తేదీవరకూ ఇంకా గడువు ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కుట్టు మిషన్ల ప్రొక్యూర్‌ మెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌, టెండర్ల తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ 7వ తేదీలోగా కుట్టుమిషన్ల ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియను పూర్తి చేయాలని, 15 తరువాత ప్రీబిడ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వెయ్యి కంటే తకువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో అవగాహన నిర్వహించాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana